ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే అలజంగి - విజయనగరం జిల్లా వార్తలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు సామాజిక కార్యక్రమాల పట్ల ఏపీఎన్జీవో సంఘం దృష్టి సారించాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు సూచించారు. పార్వతీపురంలో నిర్మించిన ఏపీఎన్జీవో సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

mla alajangi
mla alajangi

By

Published : Nov 3, 2020, 4:13 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏపీఎన్జీవో సంఘం భవనాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రతి విషయంలోనూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని జోగారావు అన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీవో సంఘం శ్రద్ధ చూపుతుందని ఎన్డీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని.. భవిష్యత్తులో మరింత విస్తృతపరుస్తామని చెప్పారు. అన్నిశాఖల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:కమల గెలవాలని సొంత గ్రామంలో పూజలు

ABOUT THE AUTHOR

...view details