విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గుట్టి వలస గ్రామానికి చెందిన ఎం.చిన్న నాయుడు దాడిలో గాయపడినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. సాయంత్రం పొలం నుంచి వస్తున్న సమయంలో తోట సమీపంలో ఏనుగు తొండంతో తోసి వేసినట్లు బాధితుడు చెప్పాడు. గ్రామ సమీపంలో ఏనుగులు తిష్టవేశాయి. చిన్న నాయుడు పరధ్యానంలో ఉండటంతో చెట్ల మధ్యనుంచి ఏనుగు దాడి చేసిందని బాధితులు అన్నారు. ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏనుగు దాడిలో వ్యక్తికి స్వల్ప గాయలు - విజయనగరం
ప్రమాదవశాత్తు ఏనుగు దాడిలో వ్యక్తికి స్వల్పం గాయలు అయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో చోటు చేసుకుంది.
ఏనుగు దాడిలో వ్యక్తికి స్వల్ప గాయలు