రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే జగన్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరణ చేస్తున్నామన్న ఆళ్ల నాని… మరో 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వివరించారు.
రాష్ట్రంలో వైద్య సేవలు విస్తృతం చేస్తాం: ఆళ్ల నాని - Vizianagaram latest news
విజయనగరం జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. వైద్య కళాశాల కోసం సేకరించిన స్థలం వివరాలు కలెక్టర్ హరి జవహర్‌లాల్ మంత్రులకు వివరించారు.

Alla nani
ఆస్పత్రుల ఏర్పాటు, ఆధునీకరణ కోసం రూ.16 వేల కోట్లు కేటాయించారని ఆళ్ల నాని చెప్పారు. ఆగస్టులో నూతన వైద్య కళాశాలల నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నామని వెల్లడించారు.