జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, చేపట్టిన చర్యలు, తాజా పరిస్థితిని.. కలెక్టర్ హరి జవహర్ లాల్ వారికి వివరించారు. కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం వ్యాప్తి ఎక్కువగా ఉందని, రికవరీ రేటు కొంత తగ్గిందని చెప్పారు. జిల్లాలోని 27 ఆసుపత్రుల్లో ప్రస్తుతం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని హౌం ఐసోలేషన్‌లో ఉంచి కొవిడ్ కిట్లు అందజేస్తున్నామని వివరించారు.
సజావుగానే సాగుతోంది...
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 10 కె.ఎల్. సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామని కలెక్టర్ చెప్పారు. దీనికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్షల కేటాయించినట్లు పేర్కొన్నారు. బొబ్బిలిలో గతంలో ఉన్న నాలుగు ఆక్సిజన్ పడకలను ప్రస్తుతం పదికి పెంచినట్లు తెలిపారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలోని 100 పడకలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అదనపు అంబులెన్స్‌లు, ఒక మహాప్రస్థానం వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. కొవిడ్ పరీక్షలు, టీకా ప్రక్రియ సజావుగా సాగుతోందని వివరించారు.
ఎల్.కోటలో కొవిడ్‌కేర్ సెంటర్...?