దసరా పండుగ రోజున మంత్రి అవంతి శ్రీనివాస్ కోల్ కతాలోని కాళీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బంగాల్ రాజధానిలోని రామకృష్ణ మఠంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకున్నట్లు మంత్రి వివరించారు.
DASARA : దసరా రోజున ఆలయాలను దర్శించుకున్న మంత్రులు - Minister Avanthi Srinivas in Kolkatta Rama Krishna Matam
దసరా పండుగ రోజున మంత్రి అవంతి శ్రీనివాస్ కోల్ కతాలోని కాళీ అమ్మ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మంత్రి బొత్స దంపతులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెలలో వీరి సొంత నిధులతో ఆలయానికి శేష, గరుడ, హంస వాహనాలను అందించారు. వీటి విలువ దాదాపు తొమ్మిది లక్షలు. దసరా రోజున వాటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మంత్రి బొత్స తెలిపారు.
ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై రేపు, ఎల్లుండి వీఐపీ దర్శనాలు రద్దు