రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. మంత్రితో పాటు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు, ఆలయ ప్రత్యేక అధికారి భ్రమరాంబ పాల్గొన్నారు. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పురోహితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సమేత నూతన ఆలయ నమూనాను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఆలయం నిర్మాణం కోసం రూ.3కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేవాలయాల్లో భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలియచేశారు.
రామతీర్థాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి - రామతీర్థం తాజా వార్తలు
వచ్చే ఏడాది జనవరి నాటికి రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రామతీర్థంలోని స్వామిస్వామిని దర్శించుకున్నారు.
minister vellampally