ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామతీర్థంలో 28న విగ్రహాల ప్రతిష్ఠాపన: మంత్రి వెలంప‌ల్లి - రామతీర్థం కొత్త విగ్రహాల ప్రతిష్ట తాజా వార్తలు

విజయనగరం జిల్లా రామతీర్థంలో జనవరి 28న సీతారామ లక్ష్మణుల కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని తెలిపారు.

minister vellampalli  srinivas
మంత్రి వెల్లంపల్లి

By

Published : Jan 25, 2021, 5:35 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో జనవరి 28న బాలాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తితిదేకి చెందిన నిష్ణాతులైన శిల్పులతో కృష్ణశీల రాతితో విగ్రహాలను తయారు చేయించామన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తయారు చేయించిన విగ్రహాలను ఇప్పటికే రామతీర్థానికి తరలించామని వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.

ధాన్యంతో నింపిన ప్రత్యేక పాత్రల్లో ప్రధానాలయంలోని హోమపు శాలలో వాటిని భద్రపరిచినట్లు మంత్రి తెలిపారు. రామతీర్థం కొండ దిగువన ఉన్న బాలాలయంలో 28వ తేదీన విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేస్తామని మంత్రి వెల్లడించారు. సోమవారం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రామతీర్థానికి కొత్త విగ్రహాలు.. రేపటి నుంచి ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details