Inauguration: విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్యశాలలో పశువైద్య చికిత్స, పశుగణ క్షేత్ర, విద్యార్థుల వసతి గృహ సముదాయాలను రాష్ట్ర పశువైద్య, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. పశుసంపద ఆధారంగానే దేశ సంపదను లెక్కగట్టవచ్చనే మహాత్మగాంధీ మాటల స్ఫూర్తితో రాష్ట్రంలో పశు సంపద అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్స కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వి.పద్మనాభ రెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ సూర్యకుమారి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు.
"రైతుభరోసా కేంద్రాల ద్వారా రాష్ట్రంలో ప్రతి వెయ్యి పశువులకు ఒక పశు వైద్య సహాయకుడిని నియమించాం. గ్రామాల్లో సైతం ఇంటింటికీ వెళ్లి పశువైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్య సహాయకుల్ని నియమించాం. సంచార పశువైద్య సేవలు అందించడానికి నూతనంగా 340 మంది పశువైద్యులను నియమిస్తున్నాం. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తాము" - సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశువైద్య, మత్స్యశాఖ మంత్రి