Minister Botsa Satyanarayana on sugarcane farmers: బొబ్బిలి ప్రాంతంలో చెరకు రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే కొంతవరకు బకాయిలు చెల్లించామని.. మిగిలిన వారికీ చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా మిల్లర్లతో మాట్లాడామన్నారు.
Minister Botsa Open community hospital in Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో రూ. 3.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సామాజిక ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రి సామర్థ్యం 30 పడకల నుంచి 50కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా... త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.