MINISTER BOTSA: విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నగరంలో అమృత్ పథకంలో భాగంగా 196 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1500 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. గత మూడేళ్లలో 7600 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో గత మూడేళ్లలో 4800 కేఎల్ లీటర్ల సామర్థ్యం గల ఐదు స్టోరేజ్ ట్యాంక్‌లను ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు.
అమ్మ ఒడి లబ్ధిదారులు సంఖ్య తగ్గిందనడం అవాస్తమని.. పాఠశాల హాజరు ఆధారంగానే లబ్దిదారుల ఎంపిక జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పిల్లలను సక్రమంగా బడికి పంపితేనే పథకం వర్తిస్తుందని.. 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామని స్పష్టం చేశారు.