ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూనే... పథకాలు కొనసాగిస్తున్నాం'

ప్రతిపక్షాలు చిన్నచిన్న తప్పిదాలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాయని... మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. తెదేపా అధినేత చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు వైరస్​ వ్యాప్తిని అడ్డుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.

'రైతు సంక్షేమ పథకాలపై తెదేపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా..?'
'రైతు సంక్షేమ పథకాలపై తెదేపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా..?'

By

Published : Apr 29, 2020, 11:52 PM IST

ప్రతిపక్షాల తీరు సరికాదన్న బొత్స

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని... మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. రెడ్​జోన్​ ప్రాంతాలపై మరింత దృష్టి సారించి.. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. మంత్రుల సమావేశంలో విజయనగరం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడిన బొత్స... రాష్ట్రంలో ఓ వైపు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూనే.. సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు హైద‌రాబాద్‌లో ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నార‌ని అసహనం వ్యక్తం చేశారు. గుజ‌రాత్‌ నుంచి మ‌త్స్యకారుల‌ను రప్పించేందుకు సర్కారు ప్రయత్నిస్తుంటే.. ఇది తన ఘనతగా చంద్రబాబు ప్రకటించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

రైతు సంక్షేమ కార్యక్రమాల‌పై ఏ జిల్లాలోనైనా చ‌ర్చించేందుకు తెదేపా నేతలు ముందుకు రావాలని బొత్స సవాల్​ విసిరారు. కరోనా కేసులు దాస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఖండించారు. క్వారంటైన్ కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని.. ఎక్కడైనా లోపాలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి..

'కరోనాతో పాటు ఎల్లో వైరస్​ను ఎదుర్కోవాల్సి వస్తోంది'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details