ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాన్సాస్' విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు సరికావు: మంత్రి బొత్స - మాన్సాస్​ ట్రస్టు వివాదం వార్తలు

మాన్సాస్​ ట్రస్టు వ్యవహారంలో ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదని మంత్రి బొత్స అన్నారు. ఆ ట్రస్టు పూర్వ, ప్రస్తుత ఛైర్మన్ కుటుంబ విషయమన్న ఆయన... అది వారే చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. హారాజ కళాశాల వ్యవహారంలో మాన్సాస్ వలన విద్యార్థులు,అధ్యాపకులకు నష్టం జరిగితే... తమ పరిధి మేరకు చర్యలు చేపడతామన్నారు

minister botsa satyanarayana
minister botsa satyanarayana

By

Published : Oct 5, 2020, 8:46 PM IST

మాన్సాస్​ ట్రస్టు వ్యవహారంలో ప్రతిసారి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం తగదిని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ ట్రస్టు పూర్వ, ప్రస్తుత ఛైర్మన్ కుటుంబ విషయమన్న ఆయన... అది వారే చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉపాధి హామీ పథకంపై విజయనగరం కలెక్టరేట్​లో సమీక్ష చేపట్టారు. జిల్లాలో జరగాల్సిన 400 కోట్ల రూపాయల మేర పనులను వచ్చే మార్చిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షపాతం తక్కువ నమోదైన కారణంగా 23 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవాన్ని ప్రస్తావిస్తూ.... కరోనా నేపథ్యంలో ఉత్సవ నిర్వహణపై పట్టణ ప్రముఖులు, అధికారులతో విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details