Botsa Comments: రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గుత్తేదారులకు బిల్లులు, ఇన్‌పుట్ రాయితీ, బోధనా రుసుములు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలను గత ప్రభుత్వం వదిలేసిందన్నారు. వాటిని తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రను దోచుకోవడానికి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వచ్చారంటున్న చంద్రబాబు.. వారు ఏం దోచుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఏం దోచుకున్నారో చెప్పాలి :మంత్రి బొత్స - ap latest news
Botsa Comments: ఉత్తరాంధ్రను దోచుకోవడానికి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వచ్చారంటున్న చంద్రబాబు.. వారు ఏం దోచుకున్నారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 'మా శాఖలపై వారేమైనా స్వారీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
"బొబ్బిలి చక్కెర కర్మాగార పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినది ఎవరు? రైతులకు ఉన్న బకాయిలు మేమే ఇచ్చాం. వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా?" - మంత్రి బొత్స సత్యనారాయణ
ఇవీ చదవండి: