Minister Botsa Satyanarayana: హైదరాబాద్‌ను 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోవాలంటూ విభజన చట్టంలో పొందుపరిచారని మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని నిన్న ప్రస్తావించానన్నారు. ఇందులో వ్యంగం ఏమీలేదని వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.
Botsa: 'ఆ మాటలు వ్యంగంగా చెప్పలేదు... చట్టంలో ఉన్నదే చెప్పాను'
Minister Botsa Satyanarayana: ఉమ్మడి రాజధానిగా 2024 వరకు హైదరాబాద్‌ను ఉపయోగించుకోవాలని విభజన చట్టంలో పొందుపరిచారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో వ్యంగం లేదని వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు.
"విభజన జరుగుతున్న సమయంలో విభజన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద, ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా మాటిచ్చారు. వాటన్నింటితో పాటు 2024 వరకు అంటే 10 ఏళ్లు రాష్ట్ర ఉమ్మడి రాజదాని హైదరాబాద్ అని.. ఈ పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని ఎక్కడ కావాలో ఆలోచించుకుని.. ఏర్పాటు చేసుకోవాలని చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టంలో ఉన్నదే నేను చెప్పాను.. వ్యంగంగా గానీ.. విమర్శించిగానీ చెప్పలేదే"- మంత్రి బొత్స సత్యనారాయణ
ఇదీ చదవండి:Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసు.. రఘురామ పిల్‌కు నెంబర్ కేటాయించాలని ఆదేశం