నిరుపేద కుటుంబాల పిల్లలు సైతం బాగా చదువుకొని వృద్దిలోకి రావాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు లాంటివని స్పష్టం చేశారు. అమ్మ ఒడి రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం కంటోన్మెంటు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో.. సంయుక్త కలెక్టర్లు మహేశ్వరరావు, వెంకటరావు, డీఈవో నాగమణితో కలసి ప్రారంభించారు. మంత్రి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్కును అందజేశారు. పథకాన్ని ఆపేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నినప్పటికీ, వాటిని అడ్డుకొని, అనుకున్న తేదీకి నగదును జమ చేస్తుండటం, ఈ పథకం అమలు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుధ్దికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
అమ్మఒడి ప్రారంభించిన ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర..