తెదేపా ఆందోళనలపై మంత్రి బొత్స(minister botsa) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి.. తెదేపాపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana) పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదని విమర్శించారు. తెదేపా అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానమేంటో చెప్పాలన్నారు. సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటని బొత్స ప్రశ్నించారు. భాజపాతో ఉన్నానంటూ చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ సమర్థన సిగ్గుచేటన్నారు.
Minister Botsa: మావోయిస్టు పార్టీకి తెదేపాకు మధ్య తేడా లేదు: మంత్రి బొత్స
తెదేపాపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీకి తెదేపాకి మధ్య తేడా లేదన్నారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.
Minister Botsa