విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో ఈ పరిశ్రమ ఏర్పడిందని..పారిశ్రామికంగా దేశానికే గుర్తింపు తీసుకొచ్చిందని బొత్స అన్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఉక్కు పరిశ్రమపై కేంద్ర నిర్ణయం ఇక్కడ ప్రజలకు బాధ కలిగిస్తోందని మంత్రి అన్నారు. ప్రస్తుతం 20నుంచి 30వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేయాలనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని అన్నారు. ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన నిర్ణయం కాబట్టి.. దీనిపై తమ ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం నిర్ణయం రాష్ట్ర ప్రజలకు బాధ కలిగిస్తోంది: బొత్స - visakha steel plant latest news
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర నిర్ణయం రాష్ట్ర ప్రజలకు బాధ కలిగిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ