'ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక పేరిట తెదేపానేతలు పోరాటాలు చేస్తామంటున్నారు..ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి' అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని, ఆలోచన చేయాలని సూచించారు.
"అధికారం కోల్పోయిన వారు ఇలాంటివి చేయకూడదు. జగన్‌మోహన్‌రెడ్డి సమగ్ర అభివృద్ధితో 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే కోర్టుకు వెళ్లారు. ఏ ఒక్క భవనం కట్టకుండా అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఉత్తరాంధ్ర అభివృద్ధి, సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు? ఏ హక్కు ఉందని అడుగుతున్నారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను స్వయంగా ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు ఈ విషయం చెప్పారు. మోదీ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు.. అప్పట్లోనే ఈ ప్రైవేటీకరణ జరిగింది. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు? అచ్చెన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు.. భక్షకులు" - బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి