ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2019, 11:33 PM IST

ETV Bharat / state

'చక్కెర కర్మాగార బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది'

విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగ్​లోని... విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం మనుగడ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగార 43వ మహాజన సభలో ఆయన పాల్గొన్నారు.

'చక్కెర కర్మాగార బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది'

'చక్కెర కర్మాగార బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది'

విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని... మంత్రి బొత్స సత్యనారాయణ హామీఇచ్చారు. ఈ సీజన్​కు చెరకు మద్దతు ధర పెంచాలని మంత్రిని రైతులు కోరారు. గత సీజన్​కు సంబంధించిన బకాయిల చెల్లింపులతో పాటు... ఫ్యాక్టరీ ఆధునీకీకరణ చర్యలు చేపట్టాలన్నారు. రైతుల విజ్ఞప్తులపై మంత్రి స్పందిస్తూ... ప్రభుత్వ పరంగా చెరకు మద్దతు ధరను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

కర్మాగారం తీవ్ర నష్టాల్లో ఉన్న కారణంగా... చెరకు కొనుగోలు ధరను పెంచలేమని... గతేడాది చెల్లించిన టన్నుకు రూ.2 వేల 612 ధరనే ఈ సీజన్​కు కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. చెరకు రైతులు సహకరిస్తే... ముఖ్యమంత్రిని ఒప్పించి భీమసింగ్ చక్కెర కర్మాగారాన్ని శాశ్వత ప్రాతిపదిక ఆధునీకీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:అవినీతి నిర్మూలనకు అహ్మదాబాద్ ఐఐఎంతో ఒప్పందం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details