ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం దగ్గర సరిపోయే భూమి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎక్కడైనా స్థలం సరిపోకుంటే... నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. ఈ నెల 24న విజయనగరంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై మంత్రి బొత్స అధికారులతో సమీక్షించారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటును ప్రతిపక్షం విమర్శించడం సరికాదని బొత్స పేర్కొన్నారు. అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చెప్పామన్నారు. విచారణ చేయండి... తప్పు చేస్తే శిక్షించండి అన్న తెదేపా... ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తే గోల చేయడమేంటని ప్రశ్నించారు.