ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వలస కార్మికుల వల్లే విజయనగరానికి కరోనా'

కరోనాపై విజయనగరం జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. 4 కరోనా కేసులు నమోదవటానికి కారణాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

alla nani
alla nani

By

Published : May 9, 2020, 3:55 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే విజయనగరం జిల్లా నెలన్నరగా గ్రీన్​జోన్‌లో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అయితే వలస కార్మికులు రావడం వల్ల 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో సమీక్షించామన్న మంత్రి... జిల్లాలో ఇకపై వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. జిల్లాలోని ప్రధాన వైద్యశాలలను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చటంతో ఇతర అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

18న విత్తనాల పంపిణీ

అనంతరం మాట్లాడిన వ్యవసాయ మంత్రి కన్నబాబు రాష్ట్రంలో కరోనా నియంత్రణతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విత్తనాల కోసం రైతులు ఇకపై మండల కేంద్రాలకు వెళ్లే పనిలేదని అన్నారు. ఇక నుంచి గ్రామస్థాయిలోనే విత్తనాల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల పంపిణీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. బత్తాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కన్నబాబు చెప్పారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details