వినియోగదారులు, అమ్మకందారుల్లో అవగాహన పెంపొందించటంతోపాటు, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ శర్మ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్న ప్లాస్టిక్ కవర్ల అమ్మకాన్ని పూర్తిగా నియంత్రించటమే కాకుండా, పర్యావరణహితమైన కాగితపు సంచుల వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తక్కువ పరిణామం కలిగిన కవర్లను సైతం వినియోగదార్ల నుంచి సేకరించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ చేత ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
"ప్లాస్టిక్ నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం"
పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు విజయనగరం నగరపాలక సంస్థ కార్యచరణ రూపొందించింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నగర కమిషనర్ తెలిపారు.
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్న కమిషనర్