ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుంది' - vijayanagaram district latest news

విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామంలో 'జగనన్న చేదోడు' పథకం కింద లబ్ది పొందిన టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుందని కొనియాడారు.

మామిడిపల్లి గ్రామంలో సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం
మామిడిపల్లి గ్రామంలో సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jun 12, 2020, 11:40 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. కరోనా వంటి కష్ట సమయంలో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్​కు రుణపడి ఉంటామని చెప్పారు. ఏటా రూ.10 వేలు తమకు ఆర్థిక సాయం అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక శంబర రోడ్డు కూడలి వద్ద దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి విగ్రహానికి, సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి:తిండి తినకుండా 16 ఏళ్లుగా 'టీ'తోనే!

ABOUT THE AUTHOR

...view details