చల్లనాయుడు వలసలో మృత్యువాత పడుతున్న సైబీరియా పక్షులు - సీతానగరంలో వలస పక్షుల మరణం
విజయనగరం జిల్లా సీతానగరం మండలం చల్లనాయుడు వలస గ్రామ సమీపంలో సైబీరియా పక్షులు నేల రాలుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వేల మైళ్ళ దూరం ప్రయాణించి... వలస వచ్చిన అతిధి పక్షులు నేల రాలుతున్నాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం చల్లనాయుడు వలస గ్రామ సమీపంలో సైబీరియా పక్షుల మృతిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారంలో వచ్చి... ఆరు నెలల పాటు ఉంటాయి. ఎప్పటిలాగే అధిక సంఖ్యలో పక్షులు వలస వచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి పక్షులు చెట్ల పైనుంచి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.