ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికుల దైన్యం... సొంత గ్రామాల్లోకి అనుమతించని గ్రామస్థులు - విజయనగరం వలస కార్మికుల అవస్థలు

గంజినీళ్లే వారికి పరమాన్నంగా మారింది... మంచి నీటితోనే ఆకలి తీర్చుకుంటున్నారు... సొంత ఊరుకు వచ్చేశామనుకున్న ఈ వలస కూలీలకు అవస్థలు తప్పలేదు. ఒక పక్క గ్రామంలోకి రావద్దన్నారు గ్రామస్థులు... మరో పక్క క్వారంటైన్​లో చోటు లేదని వెనక్కి పంపేశారు. మరో దారి లేక గ్రామానికి దూరంగా ఉన్న జీడితోటలో 3 రోజుల నుంచి కాలం వెళ్లదీస్తున్నారు.

vijayanagaram migrate workers struggles
వలస కార్మికుల అవస్థలు

By

Published : May 23, 2020, 12:04 PM IST

సొంత గ్రామాల్లోకి అనుమతించక వలస కార్మికుల అవస్థలు

వారంతా సొంత ఊరిలో పనుల్లేక రాజమహేంద్రవరం వలస వెళ్లారు ... లాక్​డౌన్ వలన సొంత ఊరుకు వచ్చేశారు. కరోనా కష్టాల్లో సొంతూళ్లకు చేరుకున్న ఈ వలసకూలీలకు అక్కడా ఇబ్బందులు తప్పలేదు. విజయనగరం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన కూలీలు....రాజమహేంద్రవరం నుంచి మూడు రోజుల క్రితం స్వస్థలానికి వచ్చారు. కరోనా భయంతో గ్రామస్థులు వీళ్లను ఊరిలోకి రానివ్వలేదు. దగ్గరలో ఉన్న గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లగా 90 మంది ఖాళీ లేదని చెప్పి అక్కడినుంచి వీళ్ళని పంపించేశారు. దీంతో కురుపాం సమీపంలో ఓ జీడితోటలో 3 రోజులుగా ఉంటున్నారు. సరైన తిండి లేక గంజి నీళ్లు తాగి ఆకలి తీర్చుకుంటున్నారు. తాగటానికి నీరు సైతం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామనీ, అధికారులు తక్షణమే స్పందించి వైద్య పరీక్షలు జరిపించి, తమ సొంత గ్రామాలకు పంపించవలసిందిగా కోరుకుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details