ఏడు నెలలుగా ఏ రకమైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పేర్కొన్నారు. వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కరోనా కష్ట కాలంలోనూ.. బడి పిల్లలకు ప్రభుత్వం అందించే బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేశామని.. అయినా నేటికి మాకు వేతనాలు చెల్లించలేదని వాపోయారు. పైగా రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని బకాయిలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.
వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలి: సీఐటీయూ - విజయనరం జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలి: సీఐటీయూ