Mid day meal workers protest at collectorate: విజయనగరం జిల్లా కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లిది. అటు మధ్యాహ్న భోజనం కార్శికులు.. ఇటు భవన నిర్మాణ కార్మికుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విజయనగరం కలెక్టరేట్ మారుమోగింది. సమస్యల పరిష్కారం కోరుతూ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు విజయనగరంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ, మధ్యాహ్న భోజన పథకం విజయనగరం జిల్లా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. జ్యోతిరావు ఫూలే విగ్రహం కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్(collectorate) కు చేరుకుని, అక్కడ ధర్నాకు దిగారు. కనీసం వేతనం చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం బిల్లులు పెంచాలని కార్మికులు నినదించారు. అన్ని వర్గాల వారీకి ఏదో విధంగా లబ్ధి చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఆర్ధిక భరోసా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ: ఒకేసారి రెండు వేలు పెంపుతో.. రూ.3వేల కు చేరిన వారి వేతనం!
'మధ్యాహ్న భోజన పథకం(Mid day meal) కార్మికులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, విద్యార్ధులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. వారి సమస్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీస వేతనం చెల్లించకపోగా, పెరిగిన ధరల మేరకైనా బిల్లుల పెంచటం లేదు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు దినసరి కూలీ కూడా గిట్టుబాటు కావటం లేదు. ఇలాంటి పరిస్థితులలో వారు పలు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీసం వేతనం పదివేలు చెల్లించాలి.'- అప్పలరాజు, ఏఐటీయూసీ, విజయనగరం జిల్లా కార్యదర్శి