విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో విశ్వనాథపురం గ్రామానికి చెందిన రేవాల సింహాచలం అనే వ్యక్తి తోటపల్లి కాలువలో జారి పడి మృతి చెందాడు. కాలువ వైపు బహిర్భూమికి వెళ్లి జారి పడి మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు.
సింహాచలం గ్రామ వాలంటీర్‌గా పని చేసినట్టు తెలుస్తోంది. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.