విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మండల సర్వేయర్లకు విమానాశ్రయ ప్రత్యేక ఉప కలెక్టర్ రామకృష్ణ సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా సర్వేయర్ల బృందంతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. ఇంకా మిగిలి ఉన్న భూములతోపాటు జాతీయ రహదారికి అనుసంధానికి కావలసిన భూమి సేకరణ వేగవంతం చేయాలన్నారు.
మరో 2 నెలల్లో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ఈ వారంలో జీఎంఆర్ సంస్థ ప్రతినిథులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.