విజయనగరంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి.. ఈ నెల 30న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఏర్పాట్లపై సమీక్షించారు(Collector review). ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఆన్లైన్ ద్వారా బోధనాసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ వెల్లడించారు.
కళాశాల నిర్మాణానికి గాజులరేగ వద్ద సేకరించిన స్థలంలోనూ, కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అవసరమైన సాంకేతిక పరికరాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. కార్యక్రమానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేటట్లు చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.