విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలసలోని పీవీజీ రాజు క్రికెట్ అకాడమీ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికగా మారింది. విశాఖపట్నం వేదికగా అక్టోబరు 2 నుంచి ఆరో తేదీ వరకు ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఇండియా బోర్డు ప్రెసిడెంట్ - దక్షిణాఫ్రికా జట్ల సన్నాహక మ్యాచ్ ఇక్కడ ప్రారంభమైంది. తొలిరోజు వర్షంతో రద్దయిన మ్యాచ్ రెండో రోజుకు వాతావరణం అనుకూలించడం వల్ల ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సపారీ జట్టు... ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లకు గానూ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ మక్రం 118 బంతుల్లో శతకం సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. హమాజ్ 92 బంతుల్లో 55 పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. ఇండియా బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ బౌలింగ్‌లో డి.ఎ.జడేజా 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్, ఇసాన్ పోరెల్ చేరో వికెట్ పడగొట్టారు. టీ విరామం తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా., వెలుతురు సరిగా లేని కారణంగా అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు.
క్రీడాభిమానుల సందడి