ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశాలో సంత ఏర్పాటు.. అయినా ఆంధ్ర సంతకే..! - నేరెళ్లవలసలో ఆంధ్ర సంతకే గిరిజనుల ఆసక్తి

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన నేరెళ్లవలసలో ప్రతీ మంగళవారం సంత నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాల ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కొటియా గ్రామంలో గురువారం సంత ఏర్పాటు చేసింది. కానీ అక్కడి గిరిజనులు మాత్రం ఒడిశా సంత కంటే ఏపీలోని సంతకు వచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర, పీవో, అధికారులతో కలిసి గిరిజనులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

market yard was inaugrated by mla rajanna dhora in nerellavalasa at vizianagaram
ఒడిశాలో సంత ఏర్పాటు.. ఆంధ్ర సంతకే గిరిజనుల ఆసక్తి

By

Published : Nov 2, 2021, 10:20 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం ఆంధ్ర ఒడిశా వివాదాస్పద గ్రామాలలో ఒకటైనా నేరెళ్లవలసలో.. ప్రతి మంగళవారం సంత నిర్వహిస్తారు. తాము పండించుకునే పంటలను అమ్ముకుని వంట సరుకులు కొనుక్కుని వెళుతుంటారు. గిరిజనులు ఆంధ్ర సంతకు వస్తే.. ఆ రాష్ట్రం వైపే మొగ్గు చూపిస్తారని ఒడిశా ప్రభుత్వం కొటియాలో గురువారం సంత ఏర్పాటు చేసింది. అయినా గిరిజనులు మాత్రం.. మంగళవారం సంతకు రావటానికి ప్రాధాన్యత చూపించారు. దీంతో.. స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర పీవో అధికారులతో కలిసి గిరిజనులకు ఉపయోగపడే మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం.. దొరల తాడివలస గ్రామంలో.. రూ.16లక్షలతో ఉమెన్స్ సెల్ఫ్ హెల్త్ గ్రూప్ ఫెడరేషన్ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఎల్లవేళలా కృషిచేస్తారని.. ఎమ్మెల్యే తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details