ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శృంగవరపుకోటలో గంజాయి పట్టివేత.. విలువ రూ.21 లక్షలు - విజయనగరం నేర వార్తలు

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిధిలో గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 21 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని వాహనంలో గుర్తించారు.

శృంగవరపుకొటలో గంజాయి పట్టివేత
శృంగవరపుకొటలో గంజాయి పట్టివేత

By

Published : Jan 9, 2021, 7:41 AM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్​పోస్టు వద్ద... గంజాయితో వెళ్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు బొలేరోను తనిఖీ చేయగా.. 30 సంచుల గంజాయి బయటపడింది.

డ్రైవర్​తో పాటు అతని సహయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 21 లక్షల రూపాయలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details