ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో పలువురు యువకులు భాజపాలో చేరిక - vizianagaram district newsupdates

పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని.. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురగాల ఉమామహేశ్వరరావు కోరారు. పార్వతీపురంలో పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో పట్టణానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు.

Many youths in Parvatipuram joined the BJP
పార్వతీపురంలో పలువురు యువకులు భాజపాలో చేరిక

By

Published : Feb 7, 2021, 12:55 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలువురు యువకులు భాజపాలో చేరారు. కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని అందుకే పార్టీ కార్యకర్తనని గర్వంగా చెప్పుకోవచ్చని నియోజకవర్గ కన్వీనర్‌, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సురగాల ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలోని ఆయన సమక్షంలో పట్టణంలో వివిధ వార్డులకు చెందిన పలువురు భాజపాలో చేరారు. తన పాలనతో మోదీ ప్రపంచ కీర్తి పొందారన్నారు. రాబోయే పుర ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేద్దామన్నారు. నాయకులు డి.సాయిపార్థసారథి, టి.శ్రీనివాసరావు, ఆర్‌.దుర్గారావు మాట్లాడారు. పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

లక్ష్యంలేని సాగు పద్దు- కర్షకులకు కొరవడిన మద్దతు

ABOUT THE AUTHOR

...view details