విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామానికి చెందిన మహిళా రైతు అన్నపూర్ణమ్మ... అర ఎకరంలో పొద్దు తిరుగుడు పంట వేశారు. సాధారణంగా ఒక పొద్దుతిరుగుడు మొక్కకి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కానీ ఈమె వేసిన పంటలోని ఒక మొక్కకి 26 పువ్వులు పూశాయి. మరో కొన్ని మొక్కలకి 3 నుంచి 12 వరకు పువ్వులు వచ్చాయి. అంతేకాకుండా ఈ పంటలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మిశ్రమ పంటలను పండిస్తున్నామని ఆమె వివరించారు. దీనిపై మండల వ్యవసాయాధికారిని అడగగా ఇటువంటివి జన్యుపరంగా వస్తాయని తెలిపారు.
పొద్దుతిరుగుడు మొక్కకి... 26 పువ్వులు..! - vizayanagaram district latest news
సాధారణంగా ఒక పొద్దుతిరుగుడు మొక్కకి ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కానీ ఓ మహిళా రైతు పండించిన పంటలో చాలా మొక్కలకి 3 నుంచి 12 పువ్వులు వచ్చాయి. ఒక మొక్కకైతే అత్యధికంగా 26 పువ్వులు పూశాయి.
![పొద్దుతిరుగుడు మొక్కకి... 26 పువ్వులు..! many flowers for sunflower plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7035069-311-7035069-1588437095068.jpg)
many flowers for sunflower plant