ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలు బహిర్గతం చేయాలి: అశోక్‌ గజపతిరాజు - Ashok Gajapathi Raju Latest News

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలు బహిర్గతం చేయాలని.. అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ విజయసాయిరెడ్డి.. విజయనగరం కలెక్టర్‌, మాన్సాస్‌ ఈవోలను అనేక వివరాలు ఎందుకు అడిగారో సమాధానం చెప్పాలని అశోక్‌ గజపతిరాజు నిలదీశారు.

అశోక్‌ గజపతిరాజు
అశోక్‌ గజపతిరాజు

By

Published : Jun 22, 2021, 3:30 PM IST

మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించిన గత రెండేళ్లుగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పాటను పాడుతున్న సంచయిత, విజయసాయిరెడ్డి ఆ వివరాలను బహిర్గతం చేయాలని.. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు డిమాండ్‌ చేశారు.

"ఈ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ క్లయింట్‌ ఎవరు, ఆడిట్ జరిగితే నిందితులు ఎవరు అనే వివరాలు వెల్లడించాలి. ఫలితాలను ఇంతవరకూ ఎందుకు బహిర్గతం చెయ్యలేదు..? ఇప్పుడు మీడియా ముందు అవే నివేదికలు కోరుతూ ఈ సన్నాయి నొక్కులు ఎందుకు..? ఈ ప్రహసనం జరుగుతున్నంతసేపూ మాన్సాస్ ట్రస్ట్‌, దానికి సంబంధించిన విద్యాసంస్థలపై దృష్టి పెట్టడం కష్టం. అవి అస్థిరపడుతూనే ఉంటాయి" అని ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

2019 జూన్‌ 20న మంత్రి బొత్స సత్యనారాయణ, అదే ఏడాది అక్టోబర్‌ 20న విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, గత ఏడాది జనవరి 21న ఎంపీ విజయసాయిరెడ్డి.. విజయనగరం కలెక్టర్‌, మాన్సాస్‌ ఈవోలను అనేక వివరాలు ఎందుకు అడిగారో సమాధానం చెప్పాలని అశోక్‌ గజపతిరాజు నిలదీశారు. ఎలాంటి అనుమానాలు వీటి ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు.. వివరాలు కోరడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... Chiranjeevi: సీఎం జగన్​ నాయకత్వం స్ఫూర్తిదాయ‌కం: చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details