మాన్సాస్ ట్రస్టు బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ కార్య నిర్వహణాధికారి (ఈవో) డి.వెంకటేశ్వరరావు.. ప్రభుత్వానికి లేఖ రాశారు. డిప్యుటేషన్ సమీపిస్తున్నందున మాతృశాఖకు (రెవెన్యూ) పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నానని ఆయన వెల్లడించారు. గతేడాది అక్టోబరు 23న ట్రస్టు ఈవోగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
సింహాచలం ఈవోగా పనిచేసిన వారే గతంలో ట్రస్టుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహించేవారు. పూర్తిస్థాయిలో ఈవోగా ఈయనే నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 22వ తేదీతో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. ట్రస్టు విద్యా సంస్థల ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకునే సమయంలో ఖాతాలను స్తంభింపజేస్తూ ఈవో రాసిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.