ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అశోక్ గజపతి రాజుపై.. అలాంటి వ్యాఖ్యలు సరికాదు: కె.నారాయణ - ashok gajapathi raju updates

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కలిశారు. వైకాపా నేతలు అశోక్ గజపతిరాజుని దొంగ అని సంబోధించటం సమంజసం కాదనిఆయన అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.

Ashok Gajapathi Raju meet CPI National Secretary K Narayana
అశోక్ గజపతి రాజు, కే నారయణ

By

Published : Jul 10, 2021, 8:25 AM IST

అశోక్ గజపతి రాజును కలిసిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారయణ

విజయనగరం పర్యటనలో ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. వైకాపా నేతలు అశోక్ గజపతిరాజుని దొంగ అని సంభోదించటం సమంజసం కాదన్నారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చని చెప్పారు. కానీ అశోక్​పై వ్యక్తిగతంగా పరిధి దాటి విమర్శలు చేయటం వైకాపా నేతలకు తగదని నారాయణ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details