మాన్సాస్ను రక్షించండి... విద్యను కాపాడండి: తెదేపా
మాన్సాస్ను రక్షించండి...విద్యను కాపాడండి అంటూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో తెదేపా నేతలు సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి కరోతు బంగార్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో వంతెన వద్ద మాన్సాస్ను రక్షించండి...విద్యను కాపాడండి అంటూ తెదేపా నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నమనాయుడు ప్రారంభించారు. మాన్సాస్ సంస్థను విచ్ఛిన్నం చేయడానికి...వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. ఈ సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వీటిని పరిశీలించి ఆస్తుల సంరక్షణకు నడుం బిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి కరోతు బంగార్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.