MANSA TRUST LAND SURVEY ISSUE: విజయనగరంలోని మహారాజ కోట పక్కనున్న స్థలానికి నగర పాలక సంస్థ అధికారులు కొలతలు నిర్వహించారు. మాన్సాస్ ట్రస్ట్‌కు సంబంధించిన స్థలాన్ని.. అనుమతి లేకుండా కొలతలు చేపట్టడంపై ట్రస్ట్ ఈవో స్పందించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
మాన్సాస్ ఛైర్మన్, దేవదాయశాఖ అధికారుల అనుమతి లేకుండా కొలతలు చేపట్టారని ఈవో తెలిపారు. మాన్సాస్ ఆస్తిపై జులుం చేస్తున్నారని.. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వివాదాస్పదంగా మారిన విజయనగరం నగరపాలక అధికారుల తీరుపై ఈవో వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.