కలెక్టర్ హరి జవహర్‌లాల్‌ను "మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్" అవార్డు వరించింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దిల్లీకి చెందిన ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తించి, ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ గత 20 ఏళ్లుగా ఈ అవార్డులను బహుకరిస్తోంది.
కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు జాతీయ పురస్కారం - Indian Achievers Forum organization latest news update
సానుకూల దృక్ఫథం, సమిష్టి కృషే తన విజయానికి కారణమని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. దిల్లీకి చెందిన ఇండియన్ ఎచీవర్స్ ఫోరమ్ సంస్థ "మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్" అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. జాతీయ పురస్కారానికి ఎంపికైన కలెక్టర్ ను అధికారులు అభినందించారు.

కలెక్టర్ జవహర్‌లాల్‌ను అభినందిస్తున్న అధికారులు
విజయనగరం జిల్లాకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిన కలెక్టర్ హరి జవహర్ లాల్ ను పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ ప్రకటించింది. కలెక్టర్ ను అధికారులు అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందచేసి.. సత్కరించి.. అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: