ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడి కళ్లెదుటే... రిక్షాలో కరోనాతో తండ్రి మృతి - విజయనగరం జిల్లా వార్తలు

కొవిడ్ కాటుకు నిరుపేదలు బలైపోతున్నారు. తాజాగా కొవిడ్​తో బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రం నుంచి కుమారుడితో కలసి వచ్చిన ఓ వ్యక్తి విజయనగరంలో మరణించాడు. తండ్రి కళ్లెదుటే మృతి చెందడంతో కుమారుడు బోరున విలపించాడు.

Man died with Corona in rickshaw
Man died with Corona in rickshaw

By

Published : Apr 30, 2021, 11:03 AM IST

కరోనా కాటుకు గురైన వ్యక్తి…. రిక్షాలోనే కన్నుమూసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన రాకేష్ కుమార్.., తన కుమారుడు బంటితో కలసి బతుకుదెరువుకు విజయనగరం వచ్చారు. తండ్రి రాకేశ్​కు​ కరోనా సోకి ఆరోగ్యం విషమించింది. చికిత్స కోసం తండ్రిని కుమారుడు రిక్షా ఎక్కించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి బయలుదేరారు. ట్యాంక్ బండ్ రోడ్డుకు వచ్చే సరికే రిక్షాలోనే రాకేశ్ అచేతనంగా పడిపోయారు. ఈ క్రమంలో కుమారుడు ఏం చేయాలో తెలియక రోడ్డు మీదే విలపించాడు. ఈ విషయం తెలిసిన విజయనగరం ఫేస్​బుక్ సంస్థ నిర్వాహకులు… అంబులెన్స్​లో రాకేశ్​ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details