విజయనగరం జిల్లా కృష్ణాపురం గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఫ్యాన్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఇతన్ని ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడు. మృతుడు గ్రామంలో ఉన్న విశాఖ మహా నగరపాలక సంస్థ జలశుద్ది కేంద్రంలో ఒప్పంద విద్యుత్ సహాయకుడి గా పనిచేస్తున్నాడు.
ఫ్యాన్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతం..వ్యక్తి మృతి - విజయనగరం తాజా వార్తలు
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కృష్ణాపురంలో జరిగింది. మృతుడు గ్రామంలో గల విశాఖ మహా నగరపాలక సంస్థ జలశుద్ది కేంద్రంలో ఒప్పంద విద్యుత్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి