Young Man Died In Kabaddi Game : విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నూతన సంవత్సర వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అదే స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. కబడ్డీ పోటీలనూ నిర్వహించారు. ఈ పోటీలలో పలు గ్రామాల జట్లు పాల్గొన్నాయి.
కబడ్డీ పోటీల్లో విషాదం.. ఆడుతూ యువకుడు మృతి - నేటి తాజా వార్తలు
Young Man Died In Kabaddi Game : విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేళ నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదాన్ని మిగిల్చాయి. ఎంతో ఉత్సహంతో ఆటగాళ్లు ఈ పోటీలలో పాల్గొన్నారు. పలు గ్రామల మధ్య నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న యువకుడు గాయపడి ప్రాణాలు కోల్పొయాడు.
కబడ్డీ ఆడుతూ యువకుడి మృతి
ఎరుకొండ-కొవ్వాడ జట్లు రెండు తలపడగా.. ఆటలో ఎరుకొండ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కిందపడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగలటంతో తీవ్ర రక్త స్రావమైంది. వెంటనే అతనిని స్థానికులు విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: