విజయనగరం జిల్లా పార్వతీపురం టెంకసింగి గ్రామంలో దారుణం జరిగింది. చిల్లంగి నెపంతో జరిగిన దాడిలో నరసింహులు అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... ప్రకాష్ అనే వ్యక్తి నరసింహులుపై కత్తితో దాడి చేశాడు. పరిస్థితి గమనించి అడ్డుకున్న నరసింహులు భార్య ఆరాలుపైనా ప్రకాష్ దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన భార్యభర్తలిద్దరిని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరసింహులు మృతిచెందాడు. పోలీసులు సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిల్లంగి నెపంతో దాడి... వ్యక్తి మృతి - man murder
చిల్లంగి నెపంతో జరిగిన దాడిలో వ్యక్తి మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
చిల్లంగి నెపంతో దాడి.. వ్యక్తి మృతి