విజయనగరంలోని పశుపతి నాథేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామున 3 గంటల నుంచే స్పటిక లింగానికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. పట్టణంలోని శివాలయం వీధిలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ శివరాత్రి ప్రత్యేక పూజలు చేశారు.
పార్వతీపురంలోని అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థాలు, సారిపల్లిలోని దిబ్బేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
ఎస్.కోట మండలం పుణ్యగిరిలోని సన్యాసేశ్వరుడు ఆలయంలో శివరాత్రి శోభ పరిఢవిల్లింది. తెర్లాం మండలం కూనయ్యవలసలోని భవానీ శంకరాలయంలో శివరాత్రి ప్రత్యేక ఆరాదనలు చేశారు. బలిజిపేట మండలం నారాయణపురంలోని చాతుర్లింగేశ్వరాయలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
గంట్యాడలోని నీలకఠేశ్వర ఆలయం, తాటిపూడి ఉమా రామలింగేశ్వరాలయం, బొడికొండల మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగాయి. మెరకముడిదాం సోమలింగాపురంలోని మహిమల ఉమా సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి శోభ నెలకొంది.