ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంపసోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - విజయనగరం జిల్లా తాజా వార్తలు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గుంప గ్రామంలో గుంప సోమేశ్వర స్వామి దర్శనార్థం తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది.

mahashivarathri celebrations
గుంపసోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Mar 11, 2021, 1:40 PM IST

Updated : Mar 11, 2021, 5:07 PM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కోమరాడ మండలం గుంప గ్రామంలో గుంపసోమేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం చుట్టూ నీటితో నిండి ఉండటంతో మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

చీపురుపల్లిలో ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంచాయతీ సర్పంచ్ ఏర్పాటు చేశారు.

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన సన్యాసి పాలెం.. సన్యాసి స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 30వేల మంది వరకు భక్తులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?

Last Updated : Mar 11, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details