విజయనగరం మహారాజా ఎయిడెడ్ కళాశాలను ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు మాన్సాస్ యాజమాన్యం ఇచ్చిన అభ్యర్థనను పరిశీలించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను (ఆర్జేడీ) ఆదేశిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ లేఖ రాశారు. ప్రైవేటీకరిస్తే తమకు రక్షణ లేకుండా పోతుందని అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై.. మంగళవారం సమావేశమైన వారు యాజమాన్యాన్ని సంప్రదించాలని నిర్ణయించారు.
సుదీర్ఘ చరిత్ర:
ఈ కళాశాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1879లో మహారాజా ఉన్నత పాఠశాలగా దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఇంటర్, డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ రెండే కొనసాగుతున్నాయి. పాఠశాలను వేరే ప్రాంగణంలోకి తరలించి ప్రైవేటుగా నిర్వహిస్తున్నారు. కళాశాలలో ఎయిడెడ్ విభాగంలో 26 మంది, అన్ ఎయిడెడ్‌లో 100 మంది అధ్యాపకులున్నారు. బోధనేతర సిబ్బందిలో 10 మంది ఎయిడెడ్, 25 మంది అన్ ఎయిడెడ్‌లో ఉన్నారు. 4వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. యూజీసీ నిధులతోనే మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల నిర్వహణ సాగుతోంది.
ఇవీ చూడండి:
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పైడిమాంబ ఉత్సవాలు: కలెక్టర్