ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తంగా మహారాజ కళాశాల విద్యార్థుల నిరసన - విజయనగరంలో విద్యార్థులు అరెస్ట్ వార్తలు

మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంలో విద్యార్థులు చేస్తున్న నిరసన ఉద్రిక్తంగా మారింది. విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

maharaja college issue students arrest in vizianagaram
నిరసనకారులను లాక్కెళ్తున్న పోలీసులు

By

Published : Oct 15, 2020, 5:35 PM IST

విజయనగరం పట్టణంలోని కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద విద్యార్థుల నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మహారాజా కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని పరిశీలించాలంటూ మాన్సాస్ ఛైర్​పర్సన్ సంచైతా గజపతిరాజు లేఖ రాయడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నాయి.

ఈ రోజు విజయనగరం కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టేందుకు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్​ల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అరెస్ట్ చేసి వాహనాల్లో ఎక్కించి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details