విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపిక పాటిల్, పలువురు ప్రజాప్రతినిధులు, గురజాడ సమాఖ్య ప్రతినిధులు., పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం మహారాజా కళాశాల వద్ద ఉన్న అప్పారావు కాంస్య విగ్రహం వరకు గురజాడ గేయాలను ఆలపిస్తూ పాదయాత్ర నిర్వహించారు. కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.
Gurajada Apparao : మహాకవి గురజాడ 159వ జయంతి వేడుకలు - Gurajada APparao jayanthi celebrations
విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
మహాకవి గురజాడ 159వ జయంతి వేడుకలు
గురజాడ రచించిన దేశమును ప్రేమించుమన్నా దేశభక్తి గీతాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు కలిసి సామూహికంగా ఆలపించారు. గురజాడ చేసిన భాషా, సాహిత్య సేవలను కొనియాడారు. జిల్లాలోని పాఠశాలల్లో గురజాడ గేయాలాపన తప్పనిసరి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి ప్రకటించారు.
ఇదీ చదవండి : విజయనగరం జిల్లా వింధ్యవాసిలో అగ్నిప్రమాదం